సోనూ సూద్ పేరు తో పెద్ద స్కాం… పశుపతి ఏమన్నాడంటే..?

0
92

బాలీవుడ్ నటుడు సోను సూద్ లాక్ డౌన్ టైంలో చేసిన సేవలను ఎవరు మర్చిపోలేరు.. ప్రజలు లాక్ డౌన్ వల్ల పడే ఇబ్బందిని గమనించి ముందుకొచ్చి వారికి ఎంతో సహాయం చేశాడు సోనూ.. చేసేది విలన్ పాత్రలే అయినా సోనూ సూద్ బయట మాత్రం రియల్ హీరో అని అయన అభిమానులు చెప్పుకున్నారు. ఎక్కడ ఉన్నా కూడా మారుమూల ప్రజల కు కష్టం వచ్చిందంటే ఆదుకునే వాడు సోనూ..

sonu sood

 

తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాలో కనిపించిన సోనూ సూద్ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తనకు పెద్ద మైనస్ గా మిగిలిపీయింది.. కనీసం తనకున్న క్రేజ్ తో అయినా సినిమా ఆడుతుందో అనుకున్నారు కానీ కంటెంట్ చాలా వీక్ గా ఉండడంతో సోను సూద్ ఇమేజ్ ఏమీ పనిచేయలేదు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో చేస్తున్నాడు సోనూసూద్.. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. అయితే తాజగా సోనూ సూద్‌ కి కోపం వచ్చింది. అంతేకాదు కొందరుదుండగులకు గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. అలాంటి పనులు చేస్తే బాగుండదని హెచ్చరించాడు. అని ప్రచారం జరుగుతుంది.

సోనూ సూద్‌ లెటర్‌ హెడ్‌పై డబ్బులు వసూలు చేస్తున్నారు దుండగులు. అమాయకులను టార్గెట్‌ గా చేసుకుని ఇలాంటి పనులకు పాల్పడుతున్నాడు. మరోవైపు సోనూ సూద్‌ లెటర్‌ హెడ్‌ పేరుతో 60 నెలలు వాయిదాల చొప్పున, 5లక్షల లోన్‌ తీసుకునే విధంగా తమ ఫౌండేషన్‌ సౌకర్యం కలుగచేస్తోందని అమాయకుల దగ్గర నుంచి కొందరు అక్రమార్కులు డబ్బు వసూలు చేస్తున్నారు. అయితే ఈ లెటర్‌ హెడ్‌ ఇవ్వడానికి మొదట ప్రతి ఒక్కరు 3500 రూపాయలు చెల్లించాలని కండీషన్‌ పెట్టారు. ముందుగా ఈ మొత్తం చెల్లించిన వారికి వెంటనే లోను శాంక్షన్‌ అవుతుంది. ప్రతి నెల ఎనిమిదివేలు కట్టాలని చెప్పారు. ఈ విషయం సోనూ సూద్‌కి చేరింది. ట్విట్టర్‌ ద్వారా సోనూ సూద్‌ ఈవిషయాన్ని ఖండించాడు. నేను ఇలాంటి రుణాలు ఇస్తానని ఎక్కడ, ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండమన్నారు. ఈ కాల్స్ వచ్చే నెంబర్‌ 9007224111 అని లెటర్‌ హెడ్‌లోని నెంబర్‌ని పేర్కొన్నారు. అంతేకాదు దీనిపై ఉత్తరప్రదేశ్‌, ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here