బిగ్ బాస్ హౌస్ లో కేవలం ఒకే ఒక్క వారం మిగిలి ఉండడంతో టాప్ ఫైవ్ లో ఉండే కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయం పై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఇక రెండు రోజులలో 14వ వారం ముగిసిపోవడంతో ఈ వారం ఎలిమినేషన్ పై ఎంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో తెలిస్తే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ మనకు తెలిసిపోతుంది.

టికెట్ టు ఫినాలే రౌండ్ లో భాగంగా శ్రీ రామచంద్ర టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్ళిపోయారు. దీంతో హౌస్ లో ఉన్నటువంటి షణ్ముఖ్, సన్నీ, మానస్, సిరి, కాజల్ నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారనే విషయం గురించి ఎక్కువ ఉత్కంఠత నెలకొంది. ఈవారం షణ్ముఖ్ నామినేషన్ లో ఉండటం వల్ల సిరికి ఓట్లు పడే అవకాశం తక్కువగా ఉంది కనుక సిరి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే కాజల్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మానస్ 100% తన ప్రజెంటేషన్ ఇవ్వడంతో ఈయన కాస్త సేఫ్ జోన్ లో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ లను టాప్ ఫైవ్ లో కి పంపించాలని భావిస్తే కచ్చితంగా ఈ వారం మానస్ బయటకు వెళ్తారు. లేదంటే సిరి లేదా కాజల్ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ కు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.




























