ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ హంగామా నడుస్తోంది. భావోద్వేగాల నడుపు సందడి సందడిగా సాగుతోంది. వాళ్లు ఫాదర్స్, మదర్స్ వస్తున్నారు. గత రెండు రోజుల నుంచి టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు కాజల్, సిరి, మానస్, శ్రీరామ చంద్ర, సన్నీ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వెళ్లారు. ఇక మిగిలిన వారిలో యాంకర్ రవి, షణ్ముక్, ప్రియాంక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లు ఈ రోజు హౌస్ లో కనపడనున్నారు.

హౌస్ లో దాదాపు 80 రోజులకు పైగా ఫ్యామిలీ మెంబర్స్ కు దూరంగా ఉండటం అంటే మాటలు కాదు. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అంటువంటి సమయంలో ఒంటరిగా ఫీల్ అవ్వడం అనేది సహజం. మనసులో ఎంత బాధ ఉన్నా ఆడుతూ, పాడుతూ, అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తూ.. విన్నర్‌గా బయటకు రావాలని హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు తమ కన్నీళ్లను బయటకు కనిపించనివ్వరు.
కానీ తమ వాళ్లు వస్తున్నారని తెలిసి ఆనందం పొంగిపోతుంటుంది.. కుటుంబ సభ్యుల్ని హౌస్‌లోకి ప్రవేశ పెట్టిన బిగ్‌బాస్ ఈరోజు యాంకర్ రవి భార్య నిత్య, కూతురు వియాని తీసుకొచ్చారు. ప్రతిరోజూ వియా ఫోటో చూడనిదే నిద్ర లేవని రవి నేరుగా కూతుర్ని చూడటంతో సంతోషంలో మునిగిపోయాడు. దీనికి సంబంధించి ఓ ప్రోమో బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేశారు.
అందులో యాంకర్ రవి తన కూతురుని ఆడించే విధానం.. అతడి బాధ కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. ఇలా బిగ్‌బాస్ హౌస్ ఎమోషన్స్‌తో నిండిపోయింది. భార్యని హగ్ చేసుకుని, కూతుర్ని ఆడించి, కన్నీళ్లతో ఒకరికొకరు బై చెప్పుకుని బయటకు వెళ్లారు. ఎంతో ఎమోషనల్ సాగే ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. రవి కూతురు వియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పొచ్చు.




























