ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఐదో సీజన్ కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నాడు. చాలా రోజులుగా దీనిపై కూడా అనుమానాలు ఉన్నాయి. నాగార్జున కాకుండా రానా దగ్గుబాటి వస్తున్నాడని.. నాగ్ బిజీ కారణంగా తప్పుకున్నాడని జరుగుతున్న ప్రచారానికి కూడా తెర పడింది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోను విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం ఉన్న ప్రోమో చాలా ఆసక్తికరంగా డిజైన్ చేసారు మేకర్స్. గతేడాది బిగ్ బాస్ 4 అందరినీ అలరించింది. రేటింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అన్నింటికంటే ముఖ్యంగా కరోనా సమయంలో వచ్చిన బిగ్ బాస్ 4కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ 5 లోగోను విడుదల చేసిన బిగ్ బాస్ యాజమాన్యం.. తాజాగా హోస్ట్ నాగార్జున ఉన్న ప్రోమోను రిలీజ్ చేశారు.
బోర్‌డమ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. వచ్చేసింది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5’ అంటూ నాగార్జున సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున అందరితో చిందులేస్తూ చెప్పే మాటలు తెలుగు ప్రేక్షకులకు హుషారును తెప్పిస్తారు. ఈ ప్రోమోతో బిగ్‌బాస్‌ను క్రేజ్‌ను మరింత పెంచేశాడు నాగార్జున. అది చూసి ఫిదా అయిపోతున్నారు అభిమానులు. దీనిని 120 రోజులు ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సీజన్ గత సీజన్ కంటే అదిరిపోతుందని షో నిర్వాహకులు నమ్మకంగా చెబుతున్నారు.
ఇప్పటికే కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేత, యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ లపేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో అందరు లేకున్నా కొంతమంది పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

































