బిగ్ బాస్ 5వ సీజన్ లో అందరి అంచానాలను నిజం చేస్తూ సన్నీ విజయం సాధించారు. సన్నీ, షణ్మఖ్ మధ్య పోటీతో ఈ సీజన్ రసవత్తరంగా సాగింది. తాజాగా సన్నీని విజేతగా నాగార్జున ప్రకటించారు. తాను వంద రోజుల నుంచి పడిన కష్టం అంతా ట్రోఫి సాధింగానే పోయిందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా సన్నీ పడుతున్న కష్టానికి ప్రతిఫలం దక్కిందని సన్నీ తల్లి భాగోద్వేగానికి గురైంది.

హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన యూట్యూబ్ స్టార్ వారు మద్దతు దక్కించుకున్నా.. ఫైనల్ లో విన్నర్ కాలేకపోయాడు. కేవలం రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ట్రోఫితో పాటు సన్నీకి రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ చెక్కును నాగార్జున అందించారు. దీంతో పాటు బాగార్జున బిగ్‌బాస్ ట్రోఫీని బహుకరించాడు. అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను అందజేశాడు.

దీనితో పాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్ సన్నీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించాడు. టీవీఎస్ బైక్ కూడా గెలుచుకున్నాడని ప్రకటించాడు. ఇంకెప్పుడైనా గెలవవచ్చని.. గెలిచామా..లేదా అనే ముఖ్యం కాదని ఎలా ఆడామన్నదే ముఖ్యమన్ని రన్నరప్ షణ్ముఖ్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత సన్నీ విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడు. నన్ను గెలిపించిన ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటా అన్నారు.
షణ్ను గురించి మాట్లాడుతూ.. షణ్ను, సిరికి అంతమంచి ఫ్రెండ్‌షిప్ దొరకడం అదృష్టమని, తనకు కూడా మానస్ రూపంలో మంచి ప్రెండ్ షిప్ దక్కిందన్నాడు సన్నీ. ఇదిలా ఉంటే.. విన్నర్ కు ఫ్లాట్ ఇచ్చిన సువర్ణ కుటీర్ డెవలపర్స్ రన్నరప్ షణ్నుకు కూడా ఎంతో కొంత ప్లాట్ ఇస్తామని ముందుకు రావడం విశేషం. ఇలా విన్నర్ తో పాటు రన్నర్ కు బహుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి.

































