బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 అప్పుడే ఆరో వారంలోకి ఎంటర్ అయ్యింది. అందులో నామినేషన్లు కూడా పూర్తి అయ్యాయి. ఇదిలా ఉండగా.. 19 మందితో మొదలైన బిగ్ బాస్ మొత్తం 5 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది.

దసరా సందర్భంగా ఈ సారి ఎలిమినేషన్ ఉండదు అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా హమిదాను ఎలిమినేట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో అనుకున్నది ఒకటి.. అయినది ఒకటిగా మారుతోంది. మొదటి వారం నుంచి కూడా ఎలిమినేట్ ఎవరు అవుతారనేది తెలియకుండా.. ఊహించని విధంగా జరుగుతున్నాయి. శ్రీరామ చంద్రతో లవ్ ట్రాక్ నడిపిస్తూ.. మంచి రొమాంటిక్ కపుల్ గా హౌస్ లో ఉన్నా.. ఆమెకు బయట సరైన ఫ్యాన్ బేస్ లేకపోవడంతోనే ఓటింగ్‌లో వెనకబడిపోయిందని నెటిజన్లు అంటున్నారు.
అయితే హమీదా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం పక్కనపెడితే ఆమె పారితోషికం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మొదటి వారంలో ఎలిమినేట్ అయిన సరయుకు పారితోషికం ఎంత ఇచ్చారో.. హమిదాకు కూడా అలాగే ఇచ్చినట్లు టాక్.
ఒక్క వారానికిగానూ హమీదా 80 వేల నుంచి లక్ష రూపాయల మేరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు చర్చ జరుగుతుంది. ఆమె మొత్తం ఐదు వారాలు హౌస్ లో ఉంది. ఆ లెక్కన ఆమె రూ.4.50పైగా తీసుకున్నట్లు తెలుస్తోది. హౌస్‌లో ఫుల్ గ్లామరస్‌గా కనిపించిన హమీదా ఎలిమినేషన్ కొంతమందికి షాక్ కు గురిచేసింది.

































