ఆ సమయంలో నేనక్కడుంటే సిరి చెంప పగలగొట్టే వాడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సి..!

0
553

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల మధ్య ఎప్పుడూ ప్రేమ పుడుతుంది ఎప్పుడు శత్రుత్వం పెరుగుతుందనే విషయాలు చెప్పడం కష్టం. అప్పటి వరకూ ఎంతో స్నేహితులుగా ఉన్నటువంటి వారు కొన్ని విషయాలలో బద్ద శత్రువులుగా మారిపోతుంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి సిరి షణ్ముఖ్ రిలేషన్ గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

వీరిద్దరు బయట ఉన్నప్పుడు షన్ను దీప్తి సునయనతో ప్రేమలో ఉండగా సిరి శ్రీహాన్ తో నిశ్చితార్థం జరుపుకుంది. అయినప్పటికీ వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఇదే విషయాన్ని సిరి స్వయంగా ఒప్పుకుంది కూడా. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన జెస్సీ వీరి రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ లకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు కనుక వీరు హౌస్ లో ఉన్న వాళ్ళతో ఎక్కువ క్లోజ్ గా మూవ్ అవుతారని తెలిపారు.కానీ ఒక్కసారిగా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారని జెస్సీ తెలిపారు.

ఇక సిరి షణ్ముఖ్ కోసం వాష్ రూమ్ లో అలా తల పగల కొట్టుకోవడం చాలా తప్పు అని అదే సమయంలో కనుక నేను అక్కడ ఉంటే సిరి చెంప పగలగొట్టేవాడిని అంటూ జెస్సీ సిరి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన సిరి తల్లి ఇదే విషయం గురించి సిరికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here