బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం లవ్ స్టోరీలు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ప్రతి ఒక్కరు వారి జీవితంలో జరిగిన పస్ట్ లవ్ గురించి తెలియజేయాలి. ఇలా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ వారి మొదటి ప్రేమ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.. ఈ క్రమంలోనే సిరి తన ఫస్ట్ లవ్ గురించి చెప్పడంతో ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సిరి పదవ తరగతిలో ఉన్నప్పుడే తన ఒక అబ్బాయిని ప్రేమించానని అతని పేరు విష్ణు.. అందరూ అతన్ని ముద్దుగా చిన్నా అని పిలిచేవారు. అతను మా ఇంటి ఎదురుగానే ఉండటం వల్ల మేమిద్దరం ప్రేమలో పడ్డామని అయితే నేను వేరే ఎవరితోనైనా మాట్లాడితే విష్ణు ఓర్చుకునే వాడుకాదు. ఈ విషయం గురించి మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోవాలని నిర్ణయించుకున్నాము. అప్పటికే ఇంట్లో సంబంధాలు కూడా చూస్తుండడంతో అతనిపై కోపంతో పెళ్లికి ఒప్పుకున్నాను.
తెల్లవారితే నిశ్చితార్థం అనగా విష్ణు ఆరోజు రాత్రి వచ్చి నా కాళ్ళ పై పడి తప్పు చేశాను నాకు నువ్వు కావాలి నన్ను క్షమించమని అడిగాడు. విష్ణు అంటే నాకు కూడా ఎంతో ఇష్టం ఇక తెల్లవారితే నిశ్చితార్థం చేసుకోవాలని ఆ రోజు రాత్రి విష్ణుతో కలిసి ఇల్లు వదిలి పారిపోయానని, ఆ తరువాత అమ్మ వాళ్లు నాతో మాట్లాడి నన్ను వెనక్కి తీసుకు వచ్చారని తెలిపింది.
ఈ విధంగా కొద్ది రోజులపాటు రిలేషన్ లో ఉన్న మేము తరచూ గొడవలు జరిగిన మా రిలేషన్ చాలా బాగుండేది. అయితే ఓ రోజు రాత్రి పడుకున్న తర్వాత తెలవారి 3 గంటలకు మెలుకువ వచ్చింది. లేసి కాసేపాగి మరి పడుకొని తిరిగి 8 గంటలకు నిద్ర లేచాను. అలా నిద్ర లేవగానే ఒక షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చిందని సిరి ఎమోషనల్ అయ్యింది. తెల్లవారుజామున 3 గంటలకు ఎప్పుడైతే మెలకువ వచ్చిందో సరిగ్గా ఆ సమయంలో విష్ణు రోడ్డు ప్రమాదంలో మరణించారనే విషయం తెలిసి సిరి కన్నీటి పర్యంతం అయ్యింది. తన మొదటి లవ్ గురించి చెప్పడంతో అది విన్న మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు.
































