బుల్లితెరపై ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమంలోకి 19 మంది కంటెస్టెంట్ లు అడుగుపెట్టి ఆటను ఎంతో రసవత్తరంగా మొదలుపెట్టారు. ఈ విధంగా ఆదివారం 19మంది కంటెస్టెంట్స్ ను లోపలికి పంపిన బిగ్ బాస్ మొదటిరోజే మూడు టాస్క్ లు ఇచ్చి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇక సోమవారం జరిగిన ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియతో ముగించారు.

ఈవారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిలో యాంకర్ రవి, హమీదా, కాజల్, సరయు, జెస్సీలు ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లో అసలు సిసలైన ఆట మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రోమోలో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు మొట్టమొదటిసారిగా పవర్ రూమ్ ని పరిచయం చేశారు.
దీనికోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ ఒక గేమ్ పెట్టగా ఈ ఆటలో విశ్వ గెలుపొంది పవర్ రూమ్ లోకి వెళ్లే అవకాశాన్ని సంపాదించుకున్నారు. ఈ విధంగా పవర్ రూమ్ లోకి వెళ్ళిన విశ్వకు బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇద్దరి కంటెస్టెంట్ ల ఒంటిపై బట్టలతో సహా అన్నివస్తువులను తీసుకొని స్టోర్ రూమ్ లో పెట్టాలని చెప్పారు. ఈ క్రమంలోనే విశ్వ యాంకర్ రవి, ప్రియాంక సింగ్ ను ఎంచుకున్నారు.
ఈ క్రమంలోనే పవర్ రూమ్ నుంచి బయటకు వచ్చిన విశ్వ రవి, ప్రియాంక బట్టలతో సహా అన్ని వస్తువులను తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టగా రవి అమ్మాయి డ్రెస్ లో దర్శనమిచ్చి అందరినీ సందడి చేశారు. ఈ క్రమంలోనే రవిని చూసి విశ్వ ఒక్కసారిగా తనని ఎత్తుకొని సందడి చేశారు. ఇక ప్రియాంక సింగ్ అబ్బాయి దుస్తులను ధరించి హౌస్ లో తనదైన శైలిలో సందడి చేసింది. ఇకపోతే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఎలా సందడి చేశారో తెలియాలంటే ఈ రోజు పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం స్టార్ మా విడుదల చేసిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

































