Bigg Boss6: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారం కావడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయడంతో ఈ కార్యక్రమం వచ్చే నెల మొదటి వారంలో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం అయితే ఆగస్టు చివరి వారంలో కంటెస్టెంట్ లను క్వారంటైన్ పంపించనున్నట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమం కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీజన్ 3 నుంచి ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే గత సీజన్ కోసం నాగార్జున ఒక్కో ఎపిసోడ్ 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా తాజాగా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

Bigg Boss6: భారీగా పెంచిన రెమ్యూనరేషన్…
సీజన్ 6 కోసం నాగార్జున ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కోసం 14 నుంచి 15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే నాగార్జున రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. అయితే ఈసారి సీజన్ లో ఎప్పటిలాగే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్లు, యూట్యూబర్స్, సీరియల్ నటీనటులు హాజరవుతున్నట్లు సమాచారం.




























