Bigg Boss6: నెంబర్ వన్ రియాల్టీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో ఆరవ సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ షో ఇప్పటికే ఆరువారాలు పూర్తిచేసుకుని ఏడవ వారంలో కొనసాగుతోంది. 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ రియాలిటీ షో లో ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య వివాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో రేవంత్ అధిక ఓటింగ్స్ సంపాదించి ప్రతివారం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ టైటిల్ విన్నర్ దిశగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ అందరూ రేవంత్ ని టార్గెట్ చేసి ప్రతివారం అతన్ని నామినేషన్ లో ఉంచుతున్నారు.అయితే రేవంత్ కి బయట ఉన్న ఫాలోయింగ్ వల్ల ప్రతివారం అత్యధిక ఓట్లు దక్కించుకొని నామినేషన్స్ నుండి బయటపడుతున్నాడు. అయితే రేవంత్ టాస్క్ విషయంలో మాత్రం చాలా అగ్రేసివుగా ఉంటూ ఇతరులతో వాదనకు దిగుతుంటాడు.
ఆ తర్వాత అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోయి మాట్లాడుతుంటాడు. ఇక వాసంతికి రేవంత్ కి మొదటి నుండి పడటం లేదు. దీంతో వీరిద్దరి మధ్య తరచూ టాస్క్ విషయంలో వాదన జరుగుతూ ఉంటుంది. తాజాగా ఏడవ వారంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ గురించి వాసంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. టాస్క్ లో భాగంగా రేవంత్ వాసంతిని డిజాస్టర్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసాడు.

Bigg Boss6: రూల్స్ ఫాలో అవ్వనివాళ్లే నేర్పిస్తున్నారు..
రేవంత్ ఇలా చేయడంతో గేమ్స్ లో రూల్స్ ఫాలో అవ్వని వాళ్ళు నాకు రూల్స్ నేర్పిస్తున్నారా? ముందు వాళ్ళు ఫాలో అవ్వాలి హౌస్ లో వంద సార్లు పడుకోవడం ఎవరికీ కనిపించలేదా? రూల్స్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? అంటూ రేవంత్ తో వాదించింది. అయితే రేవంత్ గురించి వాసంతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రేవంత్ అభిమానులు వాసంతి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



























