Bigg Boss6: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి.ఈ కార్యక్రమం అన్ని భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది ఇకపోతే తెలుగులో ఈ కార్యక్రమం 5 సీజన్లను పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారమవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలనీ అడ్వకేట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోని ఈ విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టారు. టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షోలు ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ గైడ్‌లైన్స్ పాటించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలపై స్పందించిన హై కోర్ట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1970 లలోనే ఎలాంటి సినిమాలు వచ్చాయో అందరికీ తెలిసిందే.

Bigg Boss6: విచారణ వాయిదా వేసిన హైకోర్టు..
ఈ వాదనలపై ప్రతివాదులకు నోటీసులపై తదుపరి విచారణలో తీర్పు వెల్లడిస్తామని కోర్టు అక్టోబర్ 11వ తేదీకి విచారణ వాయిదా వేసింది.మరి ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడంపై హైకోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో అక్టోబర్ 11వ తేదీన తెలియనుంది. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమం పై స్పందించిన విషయం తెలిసింది.

































