Bigg Boss 7: బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెరపై ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ అభిమానులలో అంచనాలను పెంచేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈసారి మాత్రం పాత చింతకాయ పచ్చడిగా కాకుండా కాస్త కొత్తగా ఉండబోతుందని తాజాగా నాగార్జున ప్రోమో ద్వారా తెలియచేశారు.

ఈసారి బిగ్ బాస్ కార్యక్రమం సరికొత్తగా ఉండబోతుందని తెలిపారు. అయితే అంత మాకే తెలుసు అనుకుంటే పొరపాటు పాపం పసివాళ్ళు అంటూ నాగార్జున ఈ ప్రోమోలో తెలియచేయడంతో ఈ కార్యక్రమం పై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియ కూడా పోతే అయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని సమాచారం.
ఇక ఏడవ సీజన్ ఎలాంటి విమర్శలకు తావు లేకుండా భారీ స్థాయిలో రేటింగ్ కైవసం చేసుకునే విధంగా ఈ సీజన్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఇక ఈ సీజన్ సెప్టెంబర్ మూడవ తేదీ ప్రసారం కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం కోసం మరొక వారం ముందుగానే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని పలువురు భావిస్తున్నారు.

Bigg Boss 7: ఉల్టా పల్టా అంటున్న నాగార్జున…
ఇక తాజాగా నాగార్జునకు సంబంధించిన ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో కనుక చూస్తే ఈసారి ఈ కార్యక్రమం సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పలువురు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి బిగ్ బాస్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.