Bigg Boss 7: బిగ్ బాస్ సెవెన్ హోస్ట్ గా ఈసారి కూడా నాగార్జునే…. వైరల్ అవుతున్న ఫోటో!

0
127

Bigg Boss 7: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ భాషలలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది. అయితే తెలుగులో కూడా ఇప్పటికీ ఆరు సీజన్లను పూర్తి చేసుకుని ఏడవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు పొందడమే కాకుండా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి ఇప్పటికే లోగో ప్రోమో విడుదల చేయడంతో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ కార్యక్రమానికి హోస్ట్ ఎవరు ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి కూడా తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈసారి ఈ కార్యక్రమానికి నాగార్జున కాకుండా మరో స్టార్ హీరో వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారంటూ ఇన్ని రోజులు ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఇవన్నీ అవాస్తవమేనని ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారంటూ తాజాగా ఓ ఫోటో వైరల్ గా మారింది. ఈ సీజన్ కి సంబంధించిన ఒక ప్రోమో వీడియోని విడుదల చేయడం కోసం ఇప్పటికే నాగార్జున ఫోటోషూట్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.

Bigg Boss 7: అదిరిపోయిన నాగార్జున లుక్…


ఈ క్రమంలోనే నాగర్జునకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో నాగార్జున మాస్ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఈయన చేతి ద్వారా సెవెన్ అనే సింబల్ చూపిస్తూ ఈ ఫోటో ఉండడంతో ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.