Nagarjuna: బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున నుంచి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా వ్యవహరించినటువంటి శోభా శెట్టి ఊహించని గిఫ్ట్ అందుకున్నారు. ఈమె సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు..

ఇక ఈ కార్యక్రమంలో కొన్నిసార్లు మోనిత పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి శివంగిలా అందరిపై విరుచుకుపడినటువంటి ఈమె అందరూ కూడా మొదట్లోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ 14వ వారం వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూ బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా శోభా శెట్టి ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. నాగార్జున గారి నుంచి తనకు సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరి నాగార్జున ఈమెకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారనే విషయానికి వస్తే నాగార్జున సీజన్ సెవెన్ లో భాగంగా ఆరవ వారంలో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఒక వెరైటీ టీ షర్ట్ వేసుకొని వచ్చారు. అయితే శోభ మాత్రం సర్ మీ టీ షర్ట్ బాగుంది నాకు కావాలి అంటూ అడిగారు.
ఇంతకన్నా ఇంకేం కావాలి..
ఆరోజు నేను ఈ టి షర్ట్ అడగడంతో నాగార్జున సార్ దానిని గుర్తు పెట్టుకొని మరి నేను ఎలిమినేట్ అయిన రోజు ఈ టి షర్టు నాకు గిఫ్ట్ గా ఇచ్చారని ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి అంటూ ఈమె సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఆ టీ షర్ట్ ధరించి ఫోటోషూట్ కూడా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

































