Bigg Boss Rathika: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా కార్యక్రమం 12 వారాలను పూర్తి చేసుకొని 13వ వారంలోకి అడుగు పెట్టింది. ఇలా 12వ వారంలో భాగంగా డబల్ ఎలిమినేషన్ ఉండడంతో శనివారం అశ్విని బయటకు వెళ్ళగా ఆదివారం రతిక బయటకు వెళ్ళింది. ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్లు అనంతరం బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి గీతూ రాయల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గీతు తనని ప్రశ్నిస్తూ నేనేం అడిగినా తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అనే సమాధానాలు చెప్పకుండా సరైన సమాధానాలు చెప్పాలి అంటూ అడిగారు. ఇక గీతూ ప్రశ్నిస్తూ బయటకు రావడానికి కారణం ఏంటి అనడంతో అమర్ వల్లే తాను బయటకు వచ్చానని అలాగే తన చెల్లెలు అక్క అని పిలవడం బాగా గుర్తొచ్చితాను ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యానని తెలిపారు.
మీరు బిగ్ బాస్ లో గేమ్ ఆడానని అనుకుంటున్నారా అంటూ గీతూ ప్రశ్నించగా తాను ఆడలేదని ఈమె ఒప్పుకున్నారు.రతిక 1.0.. రతిక 2.0 కి తేడా ఏంటీ అని అడగ్గా.. ఆ ఎఫర్ట్ కూడా పెట్టలేదనిపిస్తుందని చెప్పింది రతిక. దీంతో మరీ ఎందుకు వెళ్లావ్ అంటూ గీతూ అడిగేసింది. ఇక తాను ఈ వరం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ప్రశాంత దగ్గర ఉన్నటువంటి ఏవిక్షన్ పాస్ నాకోసం ఉపయోగిస్తారని చాలా ఆశపడ్డాను.
నామినేషన్స్ లో లేని అమర్…
తనకోసం ఏవిక్షన్ పాస్ ఉపయోగించమని ప్రశాంత్ ను కూడా బ్రతిమలాడను కానీ ఆయన ఒప్పుకోలేదని తెలిపారు. శివాజీ కూడా ఏవిక్షన్ పాస్ విషయంలో తనకు ఏ మాత్రం హెల్ప్ చేయలేదని, అలా హెల్ప్ చేయకపోవడంతోనే బయటకు రావాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఏది ఏమైనా అందరూ అనుకున్న విధంగానే 12వ వారంలో రతిక బయటకు వచ్చారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా అమర్ మినహా మిగిలిన ఏడు మంది కంటెస్టెంట్లు కూడా నామినేషన్ లో ఉన్నారు.
































