Aswini Sree: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అశ్విని శ్రీ ఒకరు. ఇదివరకే పలు సినిమాలలో నటించినప్పటికీ బిగ్ బాస్ ద్వారా ఈమె వెలుగులోకి వచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అశ్విని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈమె పవన్ కళ్యాణ్ తో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించారు. మరి పవన్ కళ్యాణ్ గురించి ఈమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు ఆయన మాతో చాలా సరదాగా ఉండే వారిని తెలిపారు.
నేను ఒకరోజు షూటింగ్ కి వెళ్తే కేవలం ఒకసారి మాత్రమే షూట్లో పాల్గొనేదాన్ని మిగిలిన సమయం అంతా పవన్ కళ్యాణ్ తో కలిసి కేరవాన్ లోని ఉండేదానిని అంటూ సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నాతో సరదాగా పాటలు పాడించుకుంటూ డాన్సులు వేయించుకునే వారిని అలాగే తను తినే ఫుడ్ నాకు కూడా పెట్టే వారిని తెలిపారు.
కలలోకి వచ్చేవారు…
పవన్ కళ్యాణ్ గారితో కలిసి నేను మూడు నెలల పాటు జర్నీ చేశానని, ఆయనతో షూటింగ్ చేసి ఇంటికి వెళితే కలలోకి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చేవారు అంటూ ఈమె కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారో లేదో తెలియదు కానీ నేను మాత్రం ఆయనని మర్చిపోలేనని అశ్విని పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

































