Anchor Sravanthi Chokkarapu: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సోషల్ మీడియా వేదిక తమలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ ఎంతో మంది ఇండస్ట్రీకి యాంకర్లుగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో లేడీ యాంకర్లకు ఏమాత్రం కొదువలేదు. ఇకపోతే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో ఫేమస్ అయిన వారు ఉన్నారు.

ఈ క్రమంలోనే పుష్ప సినిమా ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు యాంకర్ స్రవంతి చొక్కారపు. చిత్తూరు యాసలో ఈమె చేసిన ఇంటర్వ్యూ ఎంతో బాగా గుర్తింపు తీసుకొచ్చింది. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఈ ముద్దుగుమ్మ ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకుంది.అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో నుంచి మధ్యలోనే వెను తిరిగి వచ్చారు.

స్రవంతి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు గ్లామర్ డోస్ భారీగా పెంచిందని చెప్పాలి.బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఫోటో షూట్ లు చేస్తూ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా బ్లాక్ బికినీలో బీచ్ లో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ ఫోటోలకు ఫోజులిచ్చారు.
అనసూయకు పోటీగా స్రవంతి…
ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఏంటి స్రవంతి ఇది అంటూ కొందరు కామెంట్లు చేయగా.. మరికొందరు అవకాశాల కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇదివరకు బుల్లితెరపై హాట్ యాంకర్ గా గ్లామర్ షో చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన యాంకర్ అనసూయకు స్రవంతి గట్టి పోటీ ఇస్తుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
































