రోజులు గడుస్తున్నా కొద్ది హౌస్ లో ఉత్కంఠ సాగుతోంది. ఎవరు ఎవరిపై విరుచుపడతారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. 19 మందితో మొదలైన ఈ బిగ్ బాస్ జర్నీ ప్రస్తుతం 9 మందితో కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే రవి మినహా మిగిలిన 8 మంది నామినేషన్లోకి వచ్చేశారు.

ఇందులో ఎక్కువగా వీక్ గా కనిపిస్తుంది కాజల్, యానీ మాస్టార్ మరియు ప్రియాంక. వీళ్లల్లో ఒకరు ఎలిమినేషన్ అనేది ఉంటుందనేది నెజిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే 10 వ వారం ఎలిమినేషన్ లేకుండా.. అనారోగ్యంతో ఉన్న జెస్సీని ఇంటి నుంచి బయటకు పంపించిన విషయం తెలిసిందే. అయితే అతడు వెళ్లిపోయి మానస్ లేదా కాజల్ ల్లో ఒకరికి లైఫ్ ఇచ్చి వెళ్లాడు.
దానికి అతడిని ప్రశంసిస్తున్నారు. అతడు విజయవాడకు చెందిన వ్యక్తి. మోడల్ గా సుప్రసిద్ధుడు. అటు మోడల్ గా, యాక్టర్ గా రాణిస్తున్నాడు. బిగ్ బాస్ లో అతడు 8వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి.. ఓ టాస్క్ లో ఒకరి చేయి అతడి మెడపై పడటంతో తీవ్ర నొప్పి రావడంతో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ రోజు నుంచే అతడు అనార్యోగ్యానికి గురయ్యాడు.
బయటకు వచ్చే ముందు అతడి హౌస్ లో స్నేహితులు అయిన షణ్ముఖ్, సిరి భావోద్వేగానికి గురయ్యారు. బిగ్‌బాస్ నుంచి వైదొలగడం బాధగా ఉందని అతడు బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదిలా ఉండగా.. జశ్వంత్ వర్టెగో తో బాధపుడుతున్నాడు. కావునా.. అతడిని కాచిగూడలోని టీఎక్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తెలిపాడు.
































