Bigg Boss: బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ప్రసారమవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి వారు ఎంతోమంది సినిమాలలో అవకాశాలు అందుకొని ఎంతో మంచి పొజిషన్లో ఉండగా మరి కొందరు ఉన్న ఇమేజ్ కాస్త డామేజ్ చేసుకున్నారు.

ఇక చాలామంది ఈ కార్యక్రమం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ సింగర్ నోయల్ సైతం ఈ కార్యక్రమం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. తాజాగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఇదొక చెత్త షో అంటూ కామెంట్లు చేశారు.
చాలామంది బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం వస్తే ఏదో రాజమౌళి సినిమాలో అవకాశం వచ్చినంత సంతోషపడుతుంటారు. బిగ్ బాస్ ఒక బొక్కలో షో ఈ షోతో రాజమౌళి సినిమాకు కంపారిజన్ ఏంటి అంటూ ఈయన మండిపడ్డారు. ఇక ఈ కార్యక్రమంలోకి వెళ్లినవారు హీరో అవ్వాలని కోరుకుంటారు. ఇలా హీరో అయ్యే క్రమంలో కొందరిని తొక్కేస్తూ ఉంటారని ఇలా తొక్కిన వాళ్ళు హీరో కాలేరని ఈయన తెలిపారు.
ఒకరిని తొక్కి హీరో అవ్వాలి..
ఇక ఈ కార్యక్రమంలో వంద రోజులు పాటు ఉంటే ఒక వ్యక్తిత్వం మొత్తం బయటపడుతుంది. తద్వారా బయటకు వచ్చిన తర్వాత వారిని అభిమానించాలి అంటే చాలా సమయం పడుతుందని అందుకే చాలామంది కెరియర్ కూడా నాశనం అవుతుంది అంటూ నోయల్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

































