టాలీవుడ్ బుల్లితెర, వెండితెర నటుడు అలీ రెజా గురించి అందరికీ పరిచయమే. తెలుగులో ప్రసారమయిన బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3 లో కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తన గేమ్ తో, తన ఉండే విధానంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతేకాకుండా ఈ షోతోనే అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ కు రాకముందు ఇతడు చాలామందికి తెలియదు. సీరియల్ చూసే ఆడియన్స్ కు మాత్రమే అతడు సుపరిచితం. కానీ బిగ్ బాస్ తర్వాత తనేంటో తాను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా.. అతడు ఇటీవల తండ్రి అయ్యాడు. పండంటి ఆడ బిడ్డకు అతడి భార్య జన్మనిచ్చింది.
కొన్ని రోజుల క్రితం తన భార్య మసుమ సీమంతాన్ని ఘనంగా నిర్వహించాడు. దీనికి ఎంతో మంది సినీ ప్రముఖులు, బుల్లితెర నటీనటులు వచ్చి ఆశ్వీర్వదించారు. ప్రస్తుతం తను తండ్రిని అయ్యాను అని.. ఇన్ స్టా వేదికగా అతడు వెల్లడించారు. నేను‘‘ఒక అందమైన దేవతకు తండ్రిని అని సగర్వంగా ప్రకటిస్తున్నాను. తల్లి మరియు బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారు.
మీ అందరి ప్రార్థనలు మరియు ఆశీర్వాదాలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ అతడు రాసుకొచ్చాడు. మరో పోస్టులో అతడు తన బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతూ దిగిన ఫొటోలను షేర్ చేశాడు. ఈ శుభవార్త తెలుసుకున్న ప్రతీ ఒక్కరు అలీ రెజాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అలీ రెజా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.































