Bigg Boss Manas: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన నటుడు మానస్ . అనంతరం కోయిలమ్మ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ సీరియల్ మంచి సక్సెస్ కావడంతో ఈయనకు బుల్లితెరపై పలు సీరియల్స్ లో అవకాశం వచ్చింది అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

ఈ బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మానస్ అనంతరం కార్తిక దీపం సీరియల్ లో నటించారు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా మానస్ గత ఏడాది శ్రీజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి జరిగి ఏడాది కూడా గడవకుండానే మానస్ సోషల్ మీడియా వేదికగా శుభవార్త తెలియజేశారు.
తండ్రి కాబోతున్న మానస్..
త్వరలోనే మా ఇంట్లోకి బుల్లి బేబీ రాబోతోందంటూ ఈయన తెలియజేశారు ఇలా తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఈయన తెలియజేయడమే కాకుండా తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం శ్రీజ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు మానస్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



























