బిగ్ బాస్ ఒటీటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హాట్ స్టార్ లో ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ పై ప్రేక్షకులకు పెద్దగా ఆశక్తి చూపడం లేదు. గత సీజన్లలో ఆరేడు వారాలలోనే ఎలిమినేట అయిన వారిని తీసుకు రావడంతో పాటూ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అవ్వడం కూడా కాస్త మైనస్ గా తయారయ్యింది. అయితే హౌస్ లో కంటెస్టంట్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్కోసారి వారి ఓవరాక్షన్ మాత్రం భరించలేము. హౌస్ లో గొడవలు, ఒకరిపై అరుచుకోవడాలు వంటివి కామన్ గా జరుగుతూనే ఉంటాయి. అయితే అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేసే ప్రేక్షకులు కూడా ఉన్నారనుకోండి. ఇక అసలు విషయానికి వస్తే..మంగళవారం ఎపిసోడ్ లో అషు రెడ్డి, అజయ్, అరియాన ముగ్గురూ కలిసి డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయారు.

ఎంటర్టైన్మెంట్స్ పేరుతో అషు రెడ్డి డైరెక్షన్ లో చెత్త స్కిట్ ఒకటి ప్లాన్ చేసారు. అందులో అజయ్, అషు రెడ్డి మొగుడు పెళ్ళాలు గా, అరియాన అజయ్ కి మరదలు గా తెగ జీవించేసారు. అసలు వీళ్ళ సంభాషణ చూసి ప్రేక్షకులు ఇదెక్కడి బూతు స్కిట్ రా బాబు అంటూ ముక్కున వేలేసుకున్నారు.

‘నాకు బావ అంటే ఇష్టం’ అంటూ అరియానా స్టార్ట్ చేయగా.. ఆషు రెడ్డి ‘నువ్వేవత్తివే నా మొగుడిని చూడటానికి.. దొంగ మొహం దానా’ అంటూ రెచ్చిపోయింది. పక్కనే ఉన్న అజయ్ ని ‘ఇక్కడ నేను ఉండగా నువ్వు దాన్ని ఎందుకు గోకుతున్నావ్.. సిగ్గులేదా? నీకు ఒక్కరు సరిపోరా? మినిషివా పశువువా?’ అంటూ రెచ్చిపోయింది అషు రెడ్డి. వీరి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చూసి ప్రేక్షకులు వామ్మో ఇదెక్కడి స్కిట్ రా బాబూ.. ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి చూద్దామనుకుంటే ఇలాంటి బూతు పురాణాలు వస్తే ఎలా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వీరి స్కిట్ కు సంబంధించిన పూర్తి విడియో చూసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.































