Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతోంది ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీ లేదా ఎనిమిదవ తేదీ ప్రసారం కాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయని సమాచారం. ఇక త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి రోజుకొక వార్త వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా పాల్గొనే వారి లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా నందమూరి హీరో పాల్గొనబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా నందమూరి హీరో బిగ్ బాస్ లోకి రాబోతున్నారని తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
మరి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న ఆ నందమూరి హీరో ఎవరనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు చైతన్య కృష్ణ అని సమాచారం. నందమూరి వారసుడిగా ఈయన కూడా పలు సినిమాలలో హీరోగా నటించారు కానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ ఇటీవల బ్రీత్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా చైతన్యకృష్ణ..
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈయన పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. నందమూరి ఫ్యామిలీ గురించి ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం గురించి పలు వ్యాఖ్యలు చేస్తూ చైతన్య కృష్ణ వార్తలలో నిలిచారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈయన ఇండస్ట్రీలో అవకాశాల కోసమే ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈయన బిగ్ బాస్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.



























