బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షోలో బిగ్ బాస్ కి ఎంతో క్రేజ్ ఉంది. మొదటగా హిందీలో ప్రసారమైన ఈ షో తరువాత పలు భాషలలో ప్రసారం అవుతూ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలోనే తెలుగులో ఈ కార్యక్రమం నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ నెలలోనే నాలుగో సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా ప్రభావం వల్ల సెప్టెంబర్ లో ప్రారంభమై, 106 రోజుల పాటు కొనసాగింది. బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో అభిజిత్ విజేతగా నిలిచారు.

బిగ్ బాస్ నాలుగవ సీజన్ పూర్తికాగానే ఐదవ సీజన్ త్వరలోనే నిర్వహించాలని బిగ్ బాస్ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే సీజన్ 5 లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్ళు అంటూ గత కొద్ది రోజుల క్రితం వరకు ఈ సోషల్ మీడియాలో వార్తలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే సీజన్ ఫైవ్ తొందరలోనే మొదలవుతుందని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో గురించి తాజా సమాచారం వినబడుతోంది.
ప్రస్తుతం కరోనా పరిస్థితులు గత ఏడాది కంటే దారుణం గా ఉండటం వల్ల ఇప్పుడే ఈ షోను నిర్వహించే ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు లేరని తెలుస్తోంది.పరిస్థితులు కొద్దిగా చక్కబడిన తరువాత గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సెప్టెంబర్ నెలలో సీజన్ 5 ప్రసారం కానుందని తెలుస్తోంది.
ఇప్పటివరకు ప్రసారమైన నాలుగు సీజన్లలో మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ కాగా, రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. మిగతా రెండు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే తర్వాత రాబోయే సీజన్ 5 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలు అన్నింటి పైనా క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ షో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.































