Shanmukh Jaswanth: యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ ల తో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు వెబ్ సిరీస్ ల ద్వారా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఇలా వచ్చిన పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ మొదటి నుంచి టైటిల్ రేసులో ఉన్నారు. అయితే ఈయన కంటెస్టెంట్ సిరితో క్లోజ్ గా ఉండటం వల్ల చివరికి రన్నర్ గా మిగిలిపోయారు. రన్నర్ గా మిగిలి పోవడమే కాకుండా తన ప్రియురాలితో బ్రేకప్ చెప్పుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. షణ్ముఖ బిగ్ బాస్ హౌస్ లో సిరితో చనువుగా ఉండటం వల్ల దీప్తి సునైనా షన్నూకి బ్రేకప్ చెప్పుకుంది.

ఈ విధంగా లవ్ బ్రేకప్ కావడంతో ఎంతో డిప్రెషన్లోకి వెళ్లి పోయిన షణ్ముఖ్ జస్వంత్ ఈ విషయంలో మరో చేదు సంఘటన జరిగింది. షణ్ముఖ్ జస్వంత్ బామ్మా నేడు తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ ఇంటిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేశారు.
తీరని బామ్మ కోరిక…
తన బామ్మ చనిపోయిన విషయాన్ని షణ్ముఖ్ యశ్వంత్ తెలియజేస్తూ తనతో ఉన్నటువంటి అటాచ్మెంట్ గురించి కూడా తెలియజేశారు. ఈ క్రమంలోనే తన బామ్మతో కలిసి ఉన్న ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. తన పెళ్లి వరకు బతికి ఉంటావా అంటూ షన్ను అడగగా.. ఏమో అంటూ తన భామ సమాధానం చెప్పింది.ఈ క్రమంలోనే వెనుకనుంచి తప్పకుండా ఉంటుంది అంటూ వెల్లడించారు. ఈ విధంగా తన పెళ్లి కూడా చూడకుండానే తన బామ్మ చనిపోవడంతో షన్ను ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.



























