బిగ్ బాస్ 5 తెలుగు 10వ వారం ఎలిమినేషన్ కూడా అయిపోయింది. కాకపోతే అధికారికంగా మాత్రం తెలియదు. అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీని బయటకు పంచించినట్లు టాక్. అయితే ఈ 10వ వారం బీబీ హోటల్ వరకు హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ బాగానే ఉన్నారు. కానీ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో తమ టవర్ కాపాడుకునే సమయంలో ఒకరిపై ఒకరు విరుచుపడిపోయారు. సన్నీ, పిరి, షణ్ముఖ్ మధ్య పెద్ద యుద్దమే జరిగింది.

ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావ్ అంటూ సన్నీ రెచ్చిపోయి మాట్లాడాడు. దీనిపై షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయనా ఘాటుగా స్పందిచారు. తన ఇన్ స్టాలో ఓ పెద్ద పోస్టును షేర్ చేశారు. అందులో ఏముందంటే.. ‘అప్పడం అయిపోతావ్ అనవసరంగానా? నువ్ ఒక్కడివే బెస్ట్ అనుకో తప్పులేదు కానీ.. మిగతా అందరినీ ఎందుకు అట్లా చూస్తున్నారు.. ? చేతగాని ఆటలు ఆడుతున్నాడు ఏంటి..?
ఫిజికల్ అయ్యి గట్టి గట్టిగా అరిస్తే గేమ్ ఆడినట్లా..? ఫిజికల్ అవ్వడం కన్నా కష్టం అయిన టాస్క్ మైండ్‌తో ఆడటం. అది షన్ను వంద శాతం ఆడుతున్నాడు. బిగ్‌బాస్ చూశాక తన మీద ప్రేమ మరింత పెరిగింది. చాలా మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తున్నాడు. యూట్యూబ్ వరకే గుర్తుపెట్టుకోనా..? ఈ స్టేజ్ వరకూ వచ్చాడు ఒక్కడే కష్టపడి అని సంతోషపడాలి కానీ.. యూట్యూబ్ వరకే అని అనడం ఏంటి..?
చాలా తప్పు సన్నీగారూ.. మీ ఆటను హౌస్‌లో బాగా ఇష్టపడతాను బట్ ఈరోజు చూడలేకపోయా. రా అంటేనే పడలేకపోయారు.. మరి మీరు అన్ని మాటలు అంటే ఎదుటి వాళ్లు పడాలా..? నాది తప్పు అయితే నేర్చుకుంటారా భై.. ఎంత బాగా చెప్పావ్ షన్నూ.. నీపై మరింత ఇష్టం ఏర్పడింది.. నిన్ను హగ్ చేసుకోవానలని ఉంది అంటూ పోస్ట్ పెట్టింది దీప్తి సునయన. ఈ పోస్టు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.



























