బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 షో రసవత్తరంగా సాగుతోంది. మొదట 19 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే 6 వారాలు పూర్తి చేసుకుంది. మొదట 19 మంది కంటెస్టెంట్ లు ఉండగా ప్రస్తుతం 13 మంది మాత్రమే మిగిలారు. ఇక ఈ వారం కూడా హౌస్ మేట్స్ నుంచి ఒకరు బయటకు వెళ్లనున్నారు. ఈసారి నామినేషన్ లో సిరి, రవి, కాజల్, యానీ మాస్టర్, ప్రియ, శ్రీరామ్, జెస్సీ, లోబో ఇలా ఎనిమిది మంది ఉన్నారు.

అయితే బిగ్ బాస్ లో తమ అభిమాన కంటెస్టెంట్ లను కాపాడుకోవడం కోసం ఇప్పటికే పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ప్రచారానికి దిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఒక కంటెస్టెంట్ కోసం ఈ విధంగా టాలీవుడ్ హీరోయిన్ రంగంలోకి దిగింది. ఆ హీరోయిన్ ఎవరు? ఎవరి కోసం రంగంలోకి దిగింది? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ బ్యూటీ ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈమె హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ రామచంద్ర కు తన మద్దతు తెలిపింది. నా ఫ్రెండ్ శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. అతను చాలా బాగా ఆడుతున్నాడు. అంతే కాకుండా కొన్ని ఎపిసోడ్లు శ్రీరామ్ పర్ఫామెన్స్ చూసి నేను ఓ మై గాడ్ అనుకున్నాను. మీరు కూడా శ్రీ రామ్ కి ఓటు వేసి అతను గెలిపించండి అంటూ పాయల్ చెప్పుకొచ్చింది.
నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నా బెస్ట్ విషెస్ ఎప్పుడూ నీకే ఉంటాయి అని తెలిపింది. మీరు కూడా శ్రీ రామ్ కి ఓటేసి మీ ప్రేమాభిమానాలు చాటుకోండి. ప్రతి ఒక్క ఓటు కూడా విలువైనదే అంటూ ఆమె తెలిపింది. ఇక శ్రీరామ్ కూడా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీరామ్ హమీద హౌస్ నుంచి వెళ్లిపోయిన దగ్గర్నుంచి కాస్త డీల పడినట్లు కనిపిస్తున్నారు. స్క్రీన్ పై కూడా పెద్దగా స్పేస్ దొరకడం లేదు.































