రంగులో ముంచి తేల్చిన శ్వేత.. హాట్ హాట్ గా సాగిపోయిన నామినేషణ్ ప్రక్రియ..

0
36

బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో అందరి రంగులు బయటపడుతున్నాయి. రాను రాను ఆసక్తికరంగా మారిపోతోంది. రెండో వారం ఎలిమినేషన్ రౌండ్ లో అంతా రచ్చ రచ్చ అయిపోయింది. నామినేషన్ కు ముందు హౌస్ లో ఉన్న 18 మంది కంటెస్టెంట్లను రెండు టీంలుగా విడదీసి.. ఒక టీం సభ్యులు వేరే టీం సభ్యులను నామినేట్ చేసే విధంగా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు.

నామినేషన్ ప్రక్రియను మొదట కెప్టెన్ సిరి మొదలు పెట్టారు. అందులో ముందుగా.. ఉమను, నటరాజ్ కు రంగు పూసి నామినేట్ చేశారు సిరి. తర్వాత ఒకరిపై ఒకరు నామినేషన్ చేయడానికి గల కారణాలను తెలియజేస్తూ.. వారికి నచ్చని వారిని నామినేట్ చేశారు. ఇందులో ముఖ్యంగా శ్వేత, ఉమ అయితే నామినేషన్ ప్రక్రియలో లిమిట్ దాటి ప్రవర్తించినట్టు అనిపించింది.

ఉమకు రంగు పూసిన తర్వాత విశ్వ దానికిగల కారణాలు చెబుతున్న సమయంలో ఉమ మాట్లాడిన తీరు అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆమె మాటలు అసభ్యకరంగా ఉండటంతో ప్రియాంకా సింగ్, షణ్ముఖ్ ఆమె మాటలను వినలేక ఇబ్బంది పడ్డారు. తర్వాత నామినేషన్ చేయడానికి వచ్చిన శ్వేత అయితే చెడుగుడు ఆడేసింది. ఒకొక్కరికి ఇచ్చి పడేసింది.

లోబో మరియు హమిదా ఇద్దరు ఫేక్ అంటూ ఆరోపణలు చేసింది. అదే కోపంతో హమిదాకు అక్కడ ఉన్న రంగుతీసుకెళ్లి ఆమె మొహంపై పూసింది. అది ఎక్కువగా ఆమె ముఖం మీద పడటంతో ఎంతో ఇబ్బంది పడింది హమిదా. లోబోకు కూడా ఆ రంగును విపరీతంగా పూసింది. తర్వాత హమిదాకు శ్వేత స్వారీ అని కూడా చెప్పింది. ఇలా నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here