Pallavi prashanth: రైతుబిడ్డగా ఒక సామాన్య వ్యక్తిగా వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా మిలియన్ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఇక ఈయన తన వీడియోల ద్వారా తనకు ఒక్కసారి బిగ్ బాస్ అవకాశం కల్పించమంటూ వేడుకున్నారు. అయితే సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈయనకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది.

ఇక ఈ కార్యక్రమంలో ఎంతో అద్భుతమైనటువంటి ఆటతీరును కనబరుస్తూ చివరికి విజేతగా నిలిచారు. ఇక ఈయన విజయం అందుకోవడంలో నటుడు శివాజీ పాత్ర కూడా కొంతవరకు ఉందని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత శివాజీ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శివాజీ ప్రశాంత్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.
ప్రశాంత్ చాలా అమాయకుడని తనకు ఏది తెలియదని తెలిపారు. ఆయనకు యూట్యూబ్లో 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని ఇలా సోషల్ మీడియాలో మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నప్పటికీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసుకోవడం తెలియక నెలకు సుమారు పది లక్షల రూపాయల వరకు నష్టపోయారు అంటూ శివాజీ తెలిపారు. తానే యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసి ఇచ్చానని ఈయన వెల్లడించారు.
లక్షల్లో డబ్బు నష్టపోయాడు…
తనకు ఎలా మానిటైస్ చేయాలి అనే ప్రాసెస్ తెలియక ఇన్ని రోజులు పెద్ద మొత్తంలోనే డబ్బు కోల్పోయారు అంటూ శివాజీ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో యావర్ శివాజీ ప్రశాంత్ ముగ్గురు ఒక బ్యాచ్ గా ఏర్పడి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన సంగతి తెలిసిందే.
































