Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమం ఇతర భాషలలో కూడా ప్రసారం అవుతూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో కూడా ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. అనుకున్న సమయాన్ని కంటే ముందుగానే ఈ కార్యక్రమం ప్రసారం కానుందని తెలుస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అలాగే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది.
ఇక ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు రెండు సీజన్లలో స్టార్ కపుల్స్ పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక సీజన్ సెవెన్ లో ఎవరు కూడా సెలబ్రిటీ కపుల్స్ పాల్గొనలేదు కానీ ఈసారి మాత్రం ఏకంగా రెండు జంటలు హౌస్ లోకి వెళ్ళబోతున్నాయని తెలుస్తుంది. బుల్లితెర సెలబ్రిటీలుగా ఎంతో పాపులర్ అయిన ఈ జోడీలు ఈసారి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం.
బుల్లితెర సెలబ్రిటీ కపుల్స్…
ఇలా కపుల్స్ గా హౌస్ లోకి వెళుతున్నటువంటి వీరి కోసం బిగ్ బాస్ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారని తెలుస్తుంది. వీరికి సపరేట్ గా గదులను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మరి హౌస్ లోకి వెళ్ళబోతున్న ఆ ఇద్దరు సెలబ్రిటీ కపుల్స్ ఎవరు అనే విషయాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.



























