Bigg Boss 8: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో కూడా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే ఈ కార్యక్రమం ఈసారి సెప్టెంబర్ లో కాకుండా ఆగస్టులోనే ప్రసారం కాబోతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సీజన్ కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో విడుదల అయింది.
సీజన్ 8 అనే లోగో తో ఈ ప్రోమో విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఆసక్తికరంగా మారిన లోగో తో ఈ ప్రోమో ఉండటంతో ఈసారి బిగ్ బాస్ కార్యక్రమం మరింత కొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టంగా తెలుస్తుంది.
హోస్ట్ గా నాగర్జున…
ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదనే చెప్పాలి. ఇక ఈసారి కూడా ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయాలను కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.

























