Bigg Boss Telugu: తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే ఆరవ సీజన్ మాత్రం అనుకున్న స్థాయిలో రేటింగ్ కైవసం చేసుకోలేకపోయింది.

ఈ విధంగా ఈ కార్యక్రమానికి మంచి రేటింగ్ రాకపోవడానికి నాగార్జున వ్యవహార శైలి కూడా కారణం అని తెలుస్తుంది. ఈయన వీకెండ్ కంటెస్టెంట్ల ముందుకు వచ్చినప్పటికీ నిజానిజాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా మాట్లాడటంతో తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు. ఇలా నాగర్జున వ్యవహారం కారణంగానే షో రేటింగ్స్ కూడా పడిపోయాయని ఈయన పట్ల వ్యతిరేకత వచ్చింది. దీంతో తదుపరి సీజన్ హోస్టుగా నాగార్జున ఉండరని కూడా వార్తలు వచ్చాయి.

Bigg Boss Telugu: ఎవరు ముందుకు రాలేదా…
ఇక ఈ వార్తలు ఆ వాస్తవం అంటూ తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రోమో కూడా విడుదలైన విషయం మనకు తెలిసిందే.అయితే నాగార్జున మాత్రమే ఈ కార్యక్రమానికి హోస్టుగా ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారు అనే విషయానికి వస్తే ఇతర స్టార్ హీరోలు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించడానికి ఆసక్తి చూపలేదు. ఇక టైర్ 2 హీరోల విషయానికి వస్తే నానికి అనుభవం ఉన్నప్పటికీ ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు దీంతో ఎవరు ఈ కార్యక్రమానికి హోస్టుగా రానిపక్షంలో తిరిగి నాగార్జుననే ఎంపిక చేశారని తెలుస్తుం