బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్తారు అనేదాని గురించి కంటెస్టెంట్ ల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి.ఈ వారం కాజల్, పింకీ బయటకు వెళ్లే అవకాశం ఉందని మాట్లాడుతుండగా షణ్ముఖ్ మానస్ వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ఇక టికెట్ టు ఫినాలే రౌండ్ లో భాగంగా పలు గేమ్స్ నిర్వహించారు.

ఇక ఐస్ వల్ల సిరి, శ్రీరామ్ ఇప్పటికి కోలుకోలేదు. పింకీ చేసిన పనివల్ల శ్రీరామ్ ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇక సిరికి కూడా మోషన్స్ కావడంతో పింకీ కలగజేసుకుని తనకి పంచదార నీళ్లు తాగమని, అరటిపండు తినమని సలహా ఇచ్చింది.
అంతలోనే బిగ్ బాస్ కలగజేసుకుని పింకీ మీరు మీకైనా ఇతర కుటుంబ సభ్యుల కైనా సొంత వైద్యం చేయకండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడంతో పింకీ తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఇక టికెట్ టు ఫినాలే ఆఖరి రౌండ్ లో శ్రీరామ్ , మానస్ పోటీపడగా ఈ రౌండ్ ముగిసే సరికి శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేలోకి అడుగుపెట్టారు. ఇలా ఫినాలేలోకి అడుగు పెట్టిన మొదటి కంటెస్టెంట్ గా శ్రీరామ్ ఎంపిక కావడంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అవకాశం అందినట్టే అంది చేజారిపోయిందని మానస్ బాధ పడ్డారు.































