క్రిప్టో కరెన్సీ గురించి అవగాహన ఉన్నవారికి బిట్ కాయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్ లో ఏ విధంగా ఒడిదొడుకులు ఉంటాయో బిట్ కాయిన్ లో కూడా అదే విధంగా ఒడిదొడుకులు ఉంటాయి. అయితే బిట్ కాయిన్ పై ఇన్వెస్ట్ చేసిన వారు ఊహించని స్థాయిలో లాభాలను పొందుతున్నారు. 2021 సంవత్సరంలో బిట్ కాయిన్ కొత్త రికార్డులను సృష్టిస్తూ ఏకంగా 30వేల డాలర్లకు చేరింది.
2011 సంవత్సరంలో బిట్ కాయిన్ ధర 0గా ఉండగా 2021 సంవత్సరం దీని ధర 34,000 డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. 2020 సంవత్సరంలో బిట్ కాయిన్ విలువ ఏకంగా 300 శాతం పెరగడం గమనార్హం. గడిచిన వారం రోజుల్లోనే బిట్ కాయిన్ విలువ ఏకంగా 6 శాతం పెరగగా బిట్ కాయిన్ పై ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు భారీ లాభాలు సొంతమవుతున్నాయి. గ్లోబల్ పేమెంట్ల కొరకు బిట్ కాయిన్లను వినియోగించే అవకాశం ఉంటుంది.
అత్యంత విలువైన కరెన్సీ అయిన బిట్ కాయిన్స్ ధర ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఒక్క బిట్ కాయిన్ ధర 25 లక్షల రూపాయలుగా ఉంది. ఆధార్, పాన్, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించి 1,000 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బిట్ కాయిన్ ఏటీఎం, జెబ్ పే, యూనో కాయిన్ ద్వారా బిట్ కాయిన్ ను సులభంగా కొనడం లేదా అమ్మడం చేయవచ్చు.
అయితే బిట్ కాయిన్ లాంటి డిజిటల్ కరెన్సీలలో పెట్టుబడులు పెట్టడం ఒక విధంగా చాలా రిస్క్ అనే చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ధర పెరగకుండా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే 2,030 నాటికి బిట్ కాయిన్ విలువ 1,35,000 డాలర్లకు చేరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.