తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో చాలామంది నాయకులు గతంలో ఉన్న పార్టీల నుంచి మెరుగైన భవిష్యత్తు కోసం మరో పార్టీలో చేరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో సరైన ప్రాధాన్యత లేని నేతలు, పదవుల కోసం ఆశ పడుతున్న నేతలు జంపింగులు చేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే వెంటనే కండువా మార్చేస్తున్నారు.

ఇలా పార్టీలు మారుస్తున్న నేతల గురించి నటి, బీజీపీ యువ మహిళానేత మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరిన సమయంలో విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు బీజేపీలో చేరడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవసరాలకు అనుగుణంగా బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నంత మాత్రాన కాషాయం మనిషి అయిపోరని మాధవీలత అన్నారు. కండువా కప్పుకుంటే దేశభక్తి, జాతీయతాభావం తన్నుకురాదని పేర్కొన్నారు.

భక్తి అనేది బ్లడ్ లో, నరనరాల్లో ఉండాలని, రక్తంలో ఉండాలని అప్పుడే కాషాయాన్ని సరిగ్గా మోయగలరని అన్నారు. అవసరానికి, పదవుల కోసం అయితే కొన్నాళ్లే ఉంటారని.. పదవులు తీసుకున్నంత మాత్రాన గొర్రె సింహం కాదని పేర్కొన్నారు. అందరూ ఛీ కొట్టినా తాను బీజేపీలో చేరానని.. నన్ను ఛీ అన్నవాళ్లు సిగ్గు లేకుండా ఇప్పుడు కాషాయ కండువా కప్పుకుంటున్నారని పేర్కొన్నారు.

వాళ్లు పార్టీలో చేరినా చేరినా తాను ఛీ ఛీ అనడం లేదని తనకు తనకు సంస్కారం ఉందని మాధవీలత పేర్కొన్నారు. నాది ఒకటి కండువా, ఒకటే మాట మీరు ఊసరవెళ్లులు, నక్కలు అని మాధవీలత అన్నారు. 88 శాతం మంది ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారని యథా రాజా తథా ప్రజా అంటూ పోస్ట్ పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here