Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మంచు కుటుంబం ఈమధ్య కాలంలో ఏదో ఒక విషయంలో వివాదంలో చిక్కుకొని సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మంచు విష్ణు కొత్త సినిమా మరొక వివాదంలో చిక్కుకుంది. విష్ణు నటిస్తున్న కొత్త సినిమా జిన్నా అనే పేరును విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ టైటిల్ పోస్టర్ తీవ్ర వివాదానికి తెర తీసింది.

ఇకపోతే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ తిరుమల కొండ వెనుక నుంచి వచ్చేలా టైటిల్ డిజైన్ చేశారు. అదేవిధంగా తిరుమల కొండపై జిన్నా అనే పేరు ఉంచడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో మంచు విష్ణు పై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈయన విష్ణును హెచ్చరిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహమ్మద్ అలీ జిన్నా గురించి విష్ణు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మంచు విష్ణుకు హితబోధ చేశారు. భారతదేశంలో కొన్ని వేల మంది ఊచకోతకు కారణమైన వ్యక్తి, ఎన్నో మానభంగాలకు కారణమైన జిన్నా పేరును తన సినిమాకి పెట్టుకోవడం ఎంతో సిగ్గుచేటు అంటూ మంచు విష్ణు పై నిప్పులు కురిపించారు. ఇక గుంటూరులో జిన్నా పేరుమీద ఉన్న టవర్ సైతం తొలగించాలని ఒకవైపు మేము ఉద్యమం చేస్తుంటే మరోవైపు మీరు అతని పేరును సినిమాకు పెట్టుకోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు.
హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు…
ఈ విధంగా దేశ విభజనకు కారణమైన ఓ వ్యక్తి పేరు సినిమాకి పెట్టుకోవడం చూస్తుంటే అతని గురించి పూర్తిగా మీకు తెలుసా లేదా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇక అలాంటి వ్యక్తి పేరు సినిమాకి పెట్టుకోవడమే కాకుండా ఏకంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై సినిమా పేరు పెట్టి హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.హిందూ మనోభావాలను గౌరవిస్తూ మంచు విష్ణు తక్షణమే సినిమా పేరును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
జిన్నా' పేరుతో సినిమా టైటల్ ను ఉపసంహరించుకోండి విష్ణు గారు. @iVishnuManchu !#AndhraPradesh pic.twitter.com/1VJXsxxSq7
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 12, 2022





























