AP politics: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో వైయస్సార్సీపి పార్టీ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసింది. అయితే మరోవైపు కూటమి సైతం మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన భాజాపా కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మేనిఫెస్టో సైతం ఉమ్మడిగా విడుదల చేశారు. అయితే ఈ మేనిఫెస్టో విడుదల సమయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం అందరిలోనూ ఎన్నో సందేహాలను కలుగజేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. అలాగే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థ సింగ్ కూడా పక్కనే ఉన్నారు.
ఇక ఈ మేనిఫెస్టో విడుదల సమయంలో సిద్ధార్థ సింగ్ కనీసం మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అలాగే మేనిఫెస్టో పై కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబునాయుడు ఫోటోలే ఉన్నాయి తప్ప నరేంద్ర మోడీ ఫోటోలు ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో ఉమ్మడి మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉందని తెలుస్తోంది. ఇక సిద్ధార్థ సింగ్ ఉమ్మడి మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హామీలను నెరవేర్చడం అసాధ్యం..
ఈ విధంగా మేనిఫెస్టోకి బిజెపి దూరంగా ఉండడానికి మరే కారణం లేకపోలేదు. గత ఎన్నికలలో జగన్ ఇచ్చిన హామీలనే ఈసారి కూటమి ప్రకటించింది అయితే మరింత అదనంగా డబ్బును ఇస్తూ ప్రకటించింది ఇలాంటి హామీలన్నింటిని నెరవేర్చడం అంటే ఎంతో కష్టతరమైన పని ఒకవేళ నెరవేర్చకపోతే ఈ మోసంలో బీజేపీకి కూడా భాగం ఉంటుందని దేశవ్యాప్తంగా విమర్శలు వస్తాయి అందుకనే ఈ మేనిఫెస్టో విషయంలో బిజెపి దూరంగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. ఇలా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలపై బీజేపీకి కూడా నమ్మకం లేదని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు.





























