Akhanda Movie : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు మరోవైపు ఓటిటి లో ప్రేక్షకులను అలరిస్తూ బాలయ్య సందడి చేస్తున్నారు. ఇటీవల బాలయ్య నటించిన అఖండ సినిమా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇటీవలే సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ” అఖండ “. బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత కలెక్షన్ల సునామీ సృష్టించింది అఖండ. ఈ సినిమాకు ముందు ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన కలెక్షన్స్ 47 కోట్లు మాత్రమే. అది కూడా ఏపీలో పన్ను మినహాయింపు ఇస్తే వచ్చాయి.

అలాంటిది అఖండ మాత్రం ఏకంగా రూ.75 కోట్ల షేర్ వసూలు చేసింది. అందులోనూ కరోనా సమయంలో సినిమా వచ్చి అందరి అంచనాలను తలకిందులు చేసింది ఈ మూవీ. ఇప్పుడు ఈ సినిమా గురించి మిగిలిన ఇండస్ట్రీలు మాట్లాడుకుంటున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో అఖండ సినిమా రీమేక్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది. ముందు దీన్ని అక్కడ డబ్బింగ్ చేసి విడుదల చేయాలి అని ఆలోచన కూడా ఉండేది.
ఆ ఇద్దరిలో మూవీ రీమేక్ చేసేది ఎవరంటే !
బాలయ్యకి అంత ఇమేజ్ లేకపోవడంతో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా రైట్స్ కోసం బాలీవుడ్‌లో ఇద్దరు హీరోలు బాగా ప్రయత్నిస్తున్నారు. ఒకరు అక్షయ్ కుమార్, మరొకరు అజయ్ దేవ్‌గణ్. వీరిద్దరూ మాస్ యాక్షన్ హీరోలు కావడంతో వారికి అయితే అఖండ సినిమా పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక వీరిలో ఒకరు అఖండ సినిమా రీమేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

































