Dia Mirza: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెళ్ళికి ముందే గర్భం దాల్చిన వారు పిల్లల్ని కన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఎంతో మంది నటీమణులు ఉన్నారు. బాలీవుడ్ నటి అలియా భట్ పెళ్లయిన రెండున్నర నెలలకి తాను గర్భవతి అనే విషయాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈమె గర్భవతి అనే విషయాన్ని తెలియజేయడంతో చాలామంది ఈమె కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చిందని అందుకే అంత హడావిడిగా పెళ్లి చేసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై మరో నటి దియా మిర్జా స్పందించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ వార్తల పై స్పందించారు.

ఒక మనిషిగా వారి వ్యక్తిగత విషయాలను ఎంపిక చేసుకొని హక్కు పూర్తిగా వారికి ఉంది శృంగారం గర్భం అనే విషయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమని, అలాంటి వారు దేనికి భయపడరని ఈమె వెల్లడించారు. అయితే మనం ప్రతి ఒక్కరి వ్యక్తిత్వానికి గౌరవం ఇవ్వాలని దియా పేర్కొన్నారు. అదేవిధంగా జనాలకు నచ్చిన విషయాన్ని ఎంచుకునే హక్కు, గౌరవించే వ్యక్తులు కూడా ఉన్నారని, అధునాతనంగా ఆలోచించి స్థాయిలో ఉన్నామని తాను అనుకోవట్లేదు అంటూ ఈమె వెల్లడించారు.
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అనేది వారి వ్యక్తిగతం…
ఈ విధంగా పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దియా మీర్జా గతేడాది ఫిబ్రవరి 15న బిజినెస్ మెన్ వైభవ్ రేఖీని వివాహం చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ ప్రకటించడంతో ఈమె ప్రెగ్నెన్సీ పై కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. మొత్తానికి ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
































