టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొందరుస్టార్ డైరక్టర్స్ తమ సినిమాకు రిచ్ లుక్ అద్దేందుకు చిన్న పాత్రకు కూడా పెద్ద ఆర్టిస్ట్ లను తీసుకొస్తూంటారు. అప్పట్లో రాఘవేంద్రరావు ,ఈ కాలంలో త్రివిక్రమ్ దాన్ని ఫాలో అవుతున్నారు.అలా చేస్తే ఆ పాత్రకు వెయిటేజీ బాగా వస్తుందని, జనాల్లోకి స్పీడుగా వెళ్లిపోతుందని నమ్ముతారు.

త్రివిక్రమ్ సినిమాలను గమనిస్తే అది అర్దమవుతుంది. అత్తారింటికి దారేదీలో నదియా,’సన్నాఫ్ సత్యమూర్తి’లో స్నేహ, ‘అజ్ఞాతవాసి’ లో ఖుష్బూ.. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో దేవయాని, అల వైకుంఠపురములో టబు, సుశాంత్ ఇలా ప్రతీ పాత్రకూ పేరున్నవాళ్లే కనిపించి మురిపిస్తారు. అందుకే త్రివిక్రమ్ సినిమా పోస్టర్ అనగానే భారీలుక్ వచ్చేస్తుంది. అందంగా కనిపిస్తుంటుంది.
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ..ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నాడు త్రివిక్రమ్. మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం ఆర్టిస్ట్ ల ఎంపికలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారదట. ఈనెల 31న లాంఛనంగా ప్రారంభం అయ్యే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం.. శిల్పాశెట్టిని ఎంచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.అలాగే మరో పాత్ర కోసం అక్కినేని సుమంత్ ని తీసుకోవాలని భావిస్తున్నార్ట.
ఇంక వీళ్లు చేసే క్యారక్టర్స్ విషయానికి వస్తే.. మహేష్ కి అత్తగా శిల్ప.. బావగా సుమంత్ కనిపించనున్నారని చెప్తున్నారు..మరి ఇందులో వాస్తవాలు ఎంతున్నాయో తెలియాలంటే వీటిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలే వరకు ఆగాల్సిందే.ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కరోనా వల్ల వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్…!!





























