Sonakshi Sinha: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్న నటి సోనాక్షి సిన్హా ఇటీవల తన స్నేహితుడిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. తన చిరకాల స్నేహితుడైన జహీర్ ఇక్బాల్‌తో ఆమె వివాహం జరిగింది. అయితే ఈ వివాహం తన తండ్రికి ఇష్టం లేదని తెలుస్తోంది.

ఇలా ఈమె పెళ్లి జరిగి పది రోజులు కూడా కాకుండానే ఈమె గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె ప్రెగ్నెంట్ అని అందుకే హడావిడిగా పెళ్లి చేసుకున్నారంటూ వార్త సంచలనంగా మారింది. ఇక పెళ్లి తర్వాత ఈమె తన భర్తతో కలిసి హాస్పిటల్ కి వెళ్లడంతో ఈ వార్త కాస్త సంచలనంగా మారింది.
ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.. పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉందని ప్రశ్నించగా జహీర్ తన మిత్రుడు కావడంతో పెళ్లి తర్వాత కూడా నాకు పెద్దగా మార్పు కనిపించలేదని తెలిపారులపై కూడా ఈమె స్పందించారు.
అనారోగ్యం పాలైన తండ్రి..
తన భర్తతో కలిసి హాస్పిటల్ కి వెళ్తేనే ప్రెగ్నెంట్ అయినట్టా అంటూ మాట్లాడారు అంతేకాకుండా తాను హాస్పిటల్ కి వెళ్లడానికి గల కారణాన్ని కూడా తెలిపారు.. ఈమె పెళ్లి తర్వాత తన తండ్రి తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడంతో ముంబై హాస్పిటల్ లో చేర్పించారట దీంతో తన భర్తతోపాటు తన తండ్రిని చూడటానికి సోనాక్షి సిన్హా వెళ్లినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇలా ఈమె హాస్పిటల్ కి వెళ్లడంతో తాను ప్రెగ్నెంట్ అంటూ వార్తలను క్రియేట్ చేశారని ఈమె క్లారిటీ ఇచ్చారు.



























