కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో రిషి కపూర్ కుటుంబ సభ్యులకు కీలక సూచనలు చేసారు ముంబై పోలీసులు. ఆసుపత్రి నుంచి నేరుగా రిషి కపూర్ భౌతికకాయాన్ని శ్మశానానికి తీసుకువెళ్లాలని సూచించారు. ఇంటికి తీసుకు వెళ్లోద్దని తెలిపారు. అయన అంత్యక్రియలకు కూడా పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడకుండా చూసుకోవాలని, కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.

ప్రముఖ హిందీ నటుడు రిషి కపూర్ అనారోగ్యం పాలవడంతో ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో బుధవారం రాత్రి ఆయన్ని ముంబై లోని హెచ్ఎన్ రియలన్స్ ఆసుపత్రికి తరలించారు. కొద్దిరోజులుగా క్యాన్సర్ పాటు, శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. 2018 నుంచి రిషి కపూర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అదే సమయంలో న్యూయార్క్ లో చికిత్స తీసుకున్నారు.



































