Borugadda Anil Kumar : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వ్యక్తి రిపబ్లిక్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్. సీఎం జగన్ ను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను బండికి కట్టి ఈడ్చుకెళ్తా అంటూ మాట్లాడిన అనిల్ కోటంరెడ్డి ఎపిసోడ్ లో బాగా వైరల్ అయ్యాడు. ఇక జనసేన, టీడీపీ మీద బాగా విమర్శలను చేస్తూ కొంతమంది నేతలను పరుషంగా విమర్శిస్తున్న అనిల్ ప్రస్తుతం సొంత పార్టీ వ్యక్తుల మీదే విమర్శలు గుప్పిస్తున్నాడు. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మీద విరుచుకుపడుతున్నాడు.

ఉండవల్లి శ్రీదేవి అవినీతి చేసింది…
బోరుగడ్డ అనిల్ కుమార్ ఉండవల్లి శ్రీదేవి గురించి మాట్లాడుతూ ఆమె అరటిపళ్ళు అమ్ముకునే వ్యక్తిని కూడా దోచుకుంది అంటూ ఆరోపించారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి క్రాస్ ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీదేవి మీద ఆరోపణలు వినిపించడంతో వైసీపీ నుండి ఆమెను సస్పెండ్ చేసారు. ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ బోరుగడ్డ అనిల్ మాట్లాడుతూ ఆమె ఎమ్మెల్యే అవ్వక ముందు చిన్న ఇంట్లో ఉండేదని ఎమ్మెల్యే అవ్వగానే 80 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంది.

తాడేపల్లి నియోజకవర్గం అసలు ఆమెకు తెలియదు, అయినా మా అధినేత ఆమెకు అవకాశం ఇస్తే ఇలా అవినీతికి పాల్పడింది అంటూ ఆరోపించారు. ఇక నా క్వారీ విషయంలో కూడా గొడవ పడింది. ఆమె నా క్వారీ మూసివేయించింది. ఆమె అడిగినంత డబ్బు ఇస్తేనే క్వారీ తెరిచేందుకు అనుమతి ఇప్పిస్తానంటూ బెదిరించింది. ఈ విషయంలో సీఎం ఆఫీస్ కి ఫిర్యాదు కూడా చేశాను అంటూ అనిల్ కుమార్ విమర్శించారు.