Borugadda Anil Kumar : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న వ్యక్తి రిపబ్లిక్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్. సీఎం జగన్ ను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను బండికి కట్టి ఈడ్చుకెళ్తా అంటూ మాట్లాడిన అనిల్. కోటంరెడ్డి ఎపిసోడ్ లో బాగా వైరల్ అయ్యాడు. ఇక జనసేన,టీడీపీ మీద బాగా విమర్శలను చేస్తూ కొంతమంది నేతలను పరుషంగా విమర్శిస్తున్న అనిల్ ప్రస్తుత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద హాట్ కామెంట్స్ చేసాడు.

అకిరా ఎవరొ చెప్పు….
బోరుగడ్డ పవన్ గురించి మాట్లాడుతూ ఇంకమ్ టాక్స్ కట్టడానికే డబ్బులు లేవంటూ ప్రచారం చేసుకుంటున్నావు మరి లగ్జరీ కార్లను ఎలా కొన్నావ్ అంటూ ప్రశ్నించాడు. ప్రచారం కోసం కొన్న వాహనము ఎలా కొన్నావ్ అకిరా నందన్ పేరిట డిపాజిట్లు ఎలా చేసావు వీటన్నిటికీ డబ్బులు ఎలా వచ్చాయి అంటూ ప్రశ్నించాడు.

అలాగే అకీరా నందన్ అనే వాడు నీకెమెవుతోడో కొడుకా కాదా అనే విషయం స్పష్టం చేసి ఎమ్మెల్యే గా పోటీ చేయి అంటూ సవాల్ విసిరాడు. నేను ధైర్యంగా మీ వాళ్ళ ముందే డిబేట్ లో నిన్ను విమర్శించాను ధైర్యం దమ్ము ఉంటే వీటికి సమాధానం చెప్పి ఎన్నికలకు రా అంటూ ఘాటు వాఖ్యలు చేసాడు బోరుగడ్డ అనిల్ కుమార్.



































