Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈయనకు సినిమాల పరంగా మాత్రమే కాకుండా ఎంతమంది అభిమానులు ఉన్నారు.

సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా బయట కనపడితే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. కనీసం వారితో ఒక్కసారి మాట్లాడి సెల్ఫీ తీసుకోవాలని భావిస్తారు. మైక్ టైసన్ విషయంలో కూడా అదే జరిగింది. ఈయన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు మైక్‌టైసన్ విమానంలో వెళ్తుండగా ఆయన వెనక సీటులో ఉన్న అభిమాని తనని గుర్తించి తనతో మాట కలిపారు.

ఈ విధంగా సదరు ప్యాసింజర్ మైక్ టైసన్ ను వదలకుండా తనతో మాట్లాడుతూ తన సహనాన్ని పరీక్షించారు.అక్కడికి మైక్ టైసన్ కాసేపు గమ్మున కూర్చోమని తనకు చెప్పినప్పటికీ వినకుండా ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ విసిగించాడు. ఇక ఆ ప్యాసింజర్ ప్రశ్నలకు విసుగుచెందిన మైక్ టైసన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ప్యాసింజర్ పై చేయి చేసుకున్నారు.
బాక్సింగ్ కోచ్…
ఈ విధంగా తనని విసిగించడంతో వెనక్కి వెళ్లి ఆ ప్యాసింజర్ పై పిడుగుద్దుల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే బాక్సింగ్ కోచ్ గా ఈయన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు.ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
#miketyson seemed to lose his cool on a #plane on Wednesday night … repeatedly #punching a man in the face after the guy had apparently annoyed him. Video Footage: TMZ pic.twitter.com/xiy9zgdrhd
— ???????????????? ???????????????????????????????????????????????????? ???????????????????????? (@NoPlugMedia) April 21, 2022































