బాక్సింగ్ లెజెండరీ మైక్ టైసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన బరిలోకి దిగారు అంటే ప్రత్యర్థులు భయంతో వణికి పోవాల్సిందే. ఇలా మైక్ టైసన్ ఆడిన 58 ఆటలలో 50 ఆటలలో విజయం సాధించగా కేవలం ఆరు మ్యాచ్ లలో మాత్రమే ఓడిపోయారు.మిగిలిన రెండు మ్యాచ్లు ఇతనితో పోటీ పడటానికి ప్రత్యర్థులు లేక రద్దయ్యాయి అంటే ఇతను ఏస్థాయిలో మ్యాచ్ ఆడేవాడో అర్థమవుతుంది

ఇకపోతే మైక్ టైసన్ రంగంలోకి దిగారు అంటే ఆవేశంలో ప్రత్యర్థుల ఎముకలు విరగొట్టే వారు ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు కోమాలోకి వెళ్ళిపోయిన వారు, ఎముకలు విరగోట్టుకున్న వారు కూడా ఉన్నారు. అయితే మైక్ టైసన్ రింగులోకి దిగే ముందు తన ఆవేశాన్ని తగ్గించుకోవడానికి కొన్ని గంటల ముందు అమ్మాయిలతో కలిసి సెక్స్ చేసే వారని తాజాగా అతని గేమ్ సీక్రెట్ తన బాడీ గార్డ్ బయటపెట్టారు.
ఇలా మైక్ టైసన్ డ్రెస్సింగ్ రూమ్లో సెక్స్ చేసిన అనంతరం రింగులోకి దిగి ఆట ఆడేవారు. అప్పుడే తనకు ఒత్తిడి తగ్గి ప్రత్యర్థులు సేఫ్ గా బయటకు వెళ్లేవారని తన బాడీ గార్డ్ రూడీ గోంజాలెజ్ తెలిపారు. ఇప్పటి వరకు ఇతను ఒక క్రీడాకారుడిగా అందరికీ పరిచయం అయినప్పటికీ తాజాగా నటుడిగా పరిచయం కాబోతున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రంలో మైక్ టైసన్ సందడి చేయబోతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఇందులో ఈయన నటిస్తున్నట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతని పై కొన్ని సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరిస్తున్నారు.
































