నేను డబ్బు విషయంలో గట్టిగా ఉంటాను కాబట్టే… 23 మందికి పెళ్లి చేసాను…!!

0
304

బ్రహ్మానందం.. అయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు… కామెడీ అంటే బ్రహ్మానందం.. బ్రహ్మానందం అంటే కామెడీ అనేట్టు ఉంటుంది పరిస్థితి. అయన మార్క్ కామెడీతో కొన్ని దశబ్దాలుగా ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉన్నారు బ్రహ్మానందం. అయితే ఆయనపై కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. అయన పారితోషకం విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారని, అస్సలు ఒక్క రూపాయి కూడా తేడా రానివ్వరని చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించారు బ్రహ్మానందం.

అయితే ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో చాలా మంది నుంచి ఎం నేర్చుకోకూడదో తెలుసుకున్నాను. ఇండస్ట్రీలో డబ్బును పట్టించుకునేవారు లేరు. డబ్బుని ఇష్టం వచ్చినట్టు ఖర్చుపెడుతుంటారు. కానీ నేను మాత్రం అలా ఉండను.. డబ్బు విషయంలో చాలా గట్టిగా ఉంటాను. అలా ఉంటాను కాబట్టే ఈరోజు ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. లేకపోతె 100 రూపాయిలు ఇవ్వాల్సిన దగ్గర 10 రూపాయిలు ఇస్తారు.. అలా ఇస్తే నా జీవితం ఏమైపోయేది అంటూ అన్నారు. డబ్బంటే నాకు ఉన్న గౌరవం ఉంది కాబట్టే.. ఇప్పటికే 23 మంది ఆడపిల్లకు పెళ్లి చేశాను. వారికి పెళ్లిళ్లు చేయకపోతే జీవితాలు ఏమయిపోయేవి… వారి మీద ఉన్న భాద్యతతోనే పెళ్లిళ్లు చేశాను. అయినా అవన్నీ నేను చెప్పుకోవాల్సిన విషయాలు కావు అంటూ తెలిపారు బ్రహ్మి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here