Brahmanandam: తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వయసు పైబడి సినిమాలను కాస్త తగ్గించారు కానీ అప్పట్లో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈయన నటించేవారు ఏడాదికి కొన్ని పదుల సంఖ్యలోనే సినిమాల ద్వారా బ్రహ్మానందం ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక బ్రహ్మానందం నటించిన కొన్ని సినిమాలు ఈయన కామెడీ ద్వారా హిట్ అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆయన క్రేజ్ ఉండేది. ఇక బ్రహ్మానందం స్టార్ కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌతం మాత్రం హీరోగా సక్సెస్ అందుకోలేకపోయారు. హీరో కటౌట్ కి ఏమాత్రం తీసిపోని గౌతం ఏడు సినిమాలలో నటించిన ఏ సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి.

ఇలా ఈయన హీరోగా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. నిజానికి ఈయనకు సినిమాలు ప్రొఫెషన్ కాదట ఏదో అలా టైంపాస్ కి ఈ ఏడు సినిమాలు చేశారని తెలుస్తుంది. గౌతమ్ బెంగళూరులో పెద్ద ఎత్తున రెస్టారెంట్ బిజినెస్లను ప్రారంభించారు. అలాగే హైదరాబాదులో ఎన్నో కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్నాయి.

30 కోట్ల ఆదాయం..
ఇవే కాకుండా ఎమ్మెన్సీ కంపెనీలలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారట. ఇలా వీటన్నింటి ద్వారా నెలకు 30 కోట్ల వరకు ఆదాయం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా నెలకు 30 కోట్ల ఆదాయం అంటే ఏడాదికి ఈయన స్టార్ హీరోలకు మించి సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇక చిన్న కొడుకు విదేశాలలో ఉద్యోగరీత్యా స్థిరపడిన సంగతి మనకు తెలిసిందే.



























