సూపర్ మ్యాన్ దుస్తులు వేసుకుని.. బస్సుకు ఎదురెళ్లాడు.. చివరికి?

0
263

సాధారణంగా చిన్న పిల్లల ఎక్కువగా సూపర్ మాన్, స్పైడర్ మాన్, బ్యాట్స్ మెన్ వంటి పాత్రలను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది పిల్లలు సూపర్ మాన్ వేషధారణలో తయారయ్యి సూపర్ మాన్ శక్తులు తనకి వచ్చాయని ఫీలవుతుంటారు. సూపర్ మాన్ చేసే విధంగానే వంటి చేతితో రైలు ఆపడం, విమానాలను ప్రమాదాల నుంచి కాపాడండి సాహసాలను ఎంతగానో ఇష్టపడుతుంటారు.

ఈ క్రమంలోనే బ్రెజిల్ కి చెందిన లుయీజ్ రిబైరో డి గ్రాండే అనే కమెడియన్ సూపర్ మ్యాన్ వేషంలో హడావిడి చేశాడు. ఈ క్రమంలోనే రోడ్డుపై వెళ్లి వేగంగా వస్తున్న బస్సును ఆపుతానని కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. ఈ క్రమంలోనే అటుగా వేగంగా వస్తున్న బస్సు ను ఆపడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ఘటన మాత్రం అతడికి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది.

సూపర్ మాన్ డ్రెస్ వేసుకోగానే తనకు కూడా అదేవిధమైన శక్తులు వచ్చాయని భావనలో ఉన్న అతను వేగంగా వస్తున్న బస్సును రెండు చేతులతో అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ బస్సు ఆగక పోగా అతనికి ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే డ్రైవర్ ఎంతో అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ఆ వ్యక్తి ఎగిరి అవతల పడ్డాడు.

బస్సు తననీ ఢీ కొట్టగానే ఈ విధంగా పడిపోయానని భయపడితే తన పరువు పోతుందని భావించి లోపల నొప్పి ఉన్నా బయటకు మాత్రం ఎంతో గంభీరంగా చూశారా బస్సు గుద్దిన నాకేమీ కాలేదు నేను ఉక్కు మనిషిని అంటూ సెల్ఫీ వీడియోను కొనసాగించాడు. అయితే ఈ ప్రమాదం కేవలం తన తప్పిదం వల్ల చోటుచేసుకుందని డ్రైవర్ తప్పు ఏమాత్రం లేదని, ఆ దేవుడే తనని రక్షించాడని లూయీస్ తెలిపాడు.